బెల్లంకొండ (M) చండ్రాజుపాలెంలో బావబామ్మర్దిల మధ్య జరిగిన ఘర్షణలో హనుమంతరావు (31)పై దాడి జరిగింది. ఆదివారం ఉదయం 11గంటలకు తన బావమరిది శ్రీను హనుమంతరావును అడవిలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడని అతడి అన్న ఆంజనేయులు తెలిపారు. దాడిలో స్పృహ కోల్పోయిన హనుమంతరావును బంధువుల సహాయంతో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.