వీధిలైట్లు లేక ప్రజలు చీకట్లో అల్లాడిపోతున్నారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు ప్రధాన వీధిలో కొద్ది రోజులుగా వీధిలైట్లు వెలగడం లేదు. అలాగే వినాయక చవితి మండపాలు మాత్రం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా ఉన్నాయి. అధికారులు స్పందించి ఇప్పటికైనా వీధిలైట్లు వెలిగించాలని ప్రజలు కోరుతున్నారు.