కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్న కాగజ్నగర్ మున్సిపాలిటీకి కనీసం 22 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో అన్నారు. నిధుల లేమితో మున్సిపాలిటీలు నిర్వీర్యం అవుతున్నాయని, మున్సిపల్ సానిటేషన్ వర్కర్లకు కూడా నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే పాల్వాయి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కనీసం డ్రైనేజీలు సిసి రోడ్లు పాడైతే రిపేర్ చేసే పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఎద్దెల చేశారు,