మహిళలను కోటీశ్వరులుగా చేయాలని తలంపుతో వారికి అనేక విధాలుగా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల విద్యుత్తు 500 గ్యాస్ సబ్సిడీ సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ కొరకు 21 వేల కోట్లు ఖర్చు చేశామని రైతులకు వరి పండిస్తే 500 బోనస్ అందజేసినట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా ప్రతి పంటకు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం తెలిపారు. ధరణితో ఇబ్బందులు పడకుండా భూభారతి ప్రవేశపెట్టి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.