వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీగా నియమితులైన కోలగట్ల శ్రావణి కి అభినందనలు వెలువెత్తుతున్నాయి. శనివారం నాడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో గొల్లలపేట గ్రామ నుండి ప్రెసిడెంట్ రామ్ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళలు వచ్చి శ్రావణి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ, తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేనిస్తానన్నారు. రానున్న రోజుల్లో పట్టణ మరియు గ్రామ మహిళల ప్రోత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా పనిచేస