తాడిపత్రి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా ఎంపికైన భూమా నాగరాగిణిని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. శుక్రవారం తాడిపత్రిలోని ఎమ్మెల్యే నివాసంలో నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపికైన భూమా నాగరాగిణిని కేక్ కట్ చేసి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి టీడీపీ కార్యకర్తలు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు.