యాడికి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా శనివారం గణనాథుల నిమజ్జన కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. యువకులు డప్పులు కొడుతూ వినాయక విగ్రహాలను ట్రాక్టర్లు, ఆటోలు, జీపులలో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. చీములవాగుపల్లి, వేములపాడు సమీపంలోని కుంటలలో గణనాథులను నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.