ఏలూరులో తమ్మిలేరు వరద హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు. ఏలూరులో మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ పర్యటించారు. నాగిరెడ్డి గూడెం డ్యామ్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో, దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి వివిధ లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు కీలక సూచనలు చేశారు.