చొప్పదండి ఫైర్ స్టేషన్ లో ఫైర్ మన్ గా విధులు నిర్వహిస్తున్న జి మనోహర్ సోమవారం రాత్రి గడ్డిమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఫైర్ స్టేషన్ అధికారులు డ్యూటీ విషయంలో తనను వేధింపులకు గురిచేస్తున్నారని సూసైడ్ లెటర్ రాశాడు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామానికి చెందిన మనోహర్ చొప్పదండి ఫైర్ స్టేషన్లో ఫైర్మన్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఫైర్ స్టేషన్ అధికారులు పవన్, కిషన్ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కించపరుస్తున్నారని, తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లెటర్లో పేర్కొన్నాడు. ఈ ఇబ్బందుల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.