ఆదోని డివిజన్లో గణేశ్ ఉత్సవాల నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో నృత్యాలు చేశారు. హోళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ భక్తులతో కలిసి డాన్స్ చేశారు. యువకులు కేరింతలు కొడుతూ ఆయనను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయా గ్రామాల శివారుల్లోని కుంటలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు.