తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభు సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్ల వసంతోత్సవం, మధ్యాహ్నం బ్రాహ్మణ సమారాధన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారి ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.