తిరుపతి జిల్లా సూళ్లూరుపేట MEOగా కెఎంఎస్ సునీల శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంఈఓ-1గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి ఆరోగ్యరీత్యా పదవి నుంచి విరమించుకున్నారు. మన్నారుపోలూరు ఉన్నత పాఠశాలలో పీఎస్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సునీలకు అధికారులు MEOగా బాధ్యతలు అప్పగించారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.