శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని రాందాస్ నాయక్ తాండ బోడే నాయక్ తండా గ్రామాలలో కదిరి రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం కారడెన్ సర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన గొడవలు జరిగిన పోలీసులకు తెలియజేయాలని సూచించారు.