అల్లవరం స్థానిక శివాలయం రోడ్డులోని కొబ్బరి గోడౌన్ వద్ద త్రాచుపాము పాము హల్చల్ చేసింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ జంపన గణేశ్ వర్మకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకూ వర్మ పామును పట్టుకున్నారు. చాకచక్యంగా డబ్బాలో బంధించి అనంతరం జనావాసాలకు దూరంగా పామును విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వర్మ కు స్థానికులు అభినందనలు తెలిపారు