సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద టోల్ సిబ్బంది అంబులెన్స్ ని వద్దులేని ఘటన ఆదివారం చోటు చేసుకోగా సోమవారం నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్ కు సైడ్ ఇవ్వకపోగా డబ్బులు కట్టి వెళ్లాల్సిందేనని సిబ్బందికి చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టుగా మాట్లాడడం విడ్డూరమని అంటున్నారు స్థానికులు.టోల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.