కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ యజమాని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టాను రీతిన వ్యవహరిస్తున్నట్లు వైద్య సిబ్బంది అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్థానిక అరుణ హాస్పిటల్ ను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా గర్భవతులకు కాన్పులు చేస్తున్నారని గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు అందడంతో తనిఖీలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ తనిఖీలలో స్కానింగ్కు మాత్రమే హాస్పిటల్ కు అనుమతి ఉన్నా స్టాఫ్ నర్సులతో గర్భవతులకు ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.