క్షణికా వేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దు అన్న ఎస్సై శేఖర్ రెడ్డి...క్షణికావేశంలో తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కరీంనగర్ జిల్లా కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా శంకరపట్నం మండలంలో బుధవారం మద్య్హనం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి కారణాలతో ఆత్మహత్య లు జరుగుతాయని, కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌన్సెలింగ్, మానసిక వైద్యం, కుటుంబ ప్రేమతో ఆత్మహత్యలను నివారించవచ్చని, చదువు ఒత్తిడి తగ్గించాలని సూచించారు.