శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంతోపాటు మండలం నల్లచెరువు తనకల్లు మండల కేంద్రాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ప్రజలకు పరిశుభ్రతపై, ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.