శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం సంబంధిత రైతులు వజీర్ ఖాన్, ఖదీర్ భాషలు పొలంలో పరిశీలించగా ట్రాన్స్ఫార్మర్ కిందపడి ఉందని తెలిపారు కాపర్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలియజేశారు.