సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శనివారం వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. వినాయక మండపం నుండి ఆలయ సమీపంలోని గరుడ పుష్కరిణి వరకు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వినాయక విగ్రహాన్ని గరుడ పుష్కరిణిలో నిమజ్జనం చేశారు.