కడప జిల్లా వేంపల్లి పట్టణంలో దాదాపు రెండు కోట్ల 30 లక్షలతో గత ప్రభుత్వంలో టీటీడీ కళ్యాణమండపానికి మరమ్మత్తులు చేశారని, రెండు సంవత్సరాల కిందటనే కళ్యాణమండపం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం ఏంటని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి టీటీడీ కల్యాణ మండపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో, రాష్ట్రంలో అనేక టీటీడీ కల్యాణ మండపాల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు.