సిపిఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు నిబద్ధతగల కమ్యూనిస్టుగా ప్రజల కోసం పనిచేశారని సిపిఎం నాయకుడు రవీందర్ రెడ్డి అన్నారు. ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ASF జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీతారాం ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.