సమస్యల పరిష్కారం కై శ్రీవారి మెట్టు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షల గురువారం కి ఏడాది పూర్తి చేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా కొనసాగుతున్న ఈ దీక్షలు 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు వ్యాపారులు గురువారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమలేశుడా మాకు న్యాయం చేయాలని కోరుతూ చిరు వ్యాపారుల కుటుంబాలు శ్రీవారికి సామూహికంగా తలనీలాలు సమర్పించారు నిలువెత్తు చిత్రపటం ముందు గోవింద నామ స్మరణలు చేస్తూ న్యాయం చేయమని టీటీడీకి విజ్ఞప్తి చేశారు.