తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసం పూజల్లో భాగంగా శుక్రవారం ఆలయ ఆవరణంలో శ్రీ మహా లక్ష్మి హోమం పూజలు ఘనంగా జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు దీవి లక్ష్మీనారాయణ ఆద్వర్యంలో జరిగిన ఈ శ్రీ మహాలక్ష్మి హోమం పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహాలక్ష్మిని దర్శించుకొని పూజలు చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నప్రసాదాలు ఉభయదాత వేనాటి దనుజయ రెడ్డి , సురేఖ దంపతులు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమాన్ని పూజా కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.