కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు ఇంటికి పరిమితం కావొద్దని, వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టేవరకు బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశమయ్యారు.