అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద గురువారం సాయంత్రం ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పకూడదని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడానికి తప్పుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఆపాలని కోరుతూ డిమాండ్ చేశారు.