సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో డిసిపి భాస్కర్ తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, దాడులకు పాల్పడకూడదని తెలిపారు. శుక్రవారం దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలలో జరిగిన ఘటనపై దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దని సూచించారు.