పట్నాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆటగాళ్ల గుట్టును జైనూర్ పోలీసులు రట్టు చేశారు. మంగళవారం సాయంత్రం జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జైనూర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై రవి అన్నారు. ఈ దాడిలో 11మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.