సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పిల్లల భోజన వసతులుతోపాటుగా వారికి విద్య అందించడం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతతో విధులు నిర్వర్తించడం హర్షించదగ్గ విషయమని బీసీ వసతి గృహ సంక్షేమ అధికారి ఎన్ వెంకట్రెడ్డిని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభినందించారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మల్యాల వెంకటరెడ్డి ఆదివారం బీసీ వసతి గృహ సంక్షేమ అధికారిగా పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, అయితే ఉద్యోగంలో బాధ్యతతో విధులు నిర్వహించడం