యూరియా అధిక వాడకం వల్లే కొరత: మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణ జిల్లాలో యూరియా కొరతపై సోమవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలిపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. సీజన్ స్టార్ట్ అయినప్పుడు దశల వారీగా యూరియా వాడారన్నారు. కానీ ఇప్పుడు ఒకేసారి రైతులు యూరియా వాడటం, వర్షాలు పడకపోవడం, ఎండలకు అవసరం కన్నా అధికంగా వాడటం వల్ల డిమాండ్ ఏర్పడిందన్నారు. బ్యాలెన్స్ చేయడంలోనూ కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. రైతులకు అవసరం మేర యూరియా జిల్లాకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.