జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దుష్ట అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట ఎర్రగుంట మాసాను గుంట చెరువులను ఆమె స్వయంగా పర్యటించారు. చెరువులు తెగిపోకుండా మరమ్మత్తులు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలోని ప్రజల తక్షణ సహాయం కొరకు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08455 276155 కి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.