తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సులూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే అందరూ పయనించాలని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు