పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలో 2024లో జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ను బుధవారం రాత్రి పోలీసులు మాచర్ల న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణం ఆయనకు 14రోజులు రిమాండ్ విధించారు.రెంటచింతల మండలంలో సానికంటి సిద్దయ్య అనే వ్యక్తి పెట్టిన కేసుకు సంబంధించి తురక కిషోర్ ను కోర్టుకు తీసుకువచ్చి పోలీసులు గట్టి భద్రతతో గుంటూరు సబ్ జైలుకు తిరిగి తరలించారు.