రేషన్ దుకాణంలో నాశరకం కంది పప్పు తో పాటు బూజు పట్టిన కందిపప్పు కలకలం రేపుతుంది. ఈ సంఘటన జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలోని 21వ రేషన్ షాప్ వద్ద 29 కేజీల కందిపప్పు బూజు పట్టి నాసిరకంతో కూడిన కందిపప్పు ఆదివారం బయటపడింది.అయితే ఈ కందిపప్పు గుర్రప్పాలెం గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలకు పౌరు సరఫరా గుడౌన్ నుంచి సరఫరా చేయడం కోసం తీసుకువచ్చిన కందిపప్పు. అయితే ఈ కందిపప్పు నాశరకంతో ఉండడంతో పాటు,బూజు పట్టి లోపల పిండి రూపంలో ఉండడంచే అంగన్వాడి సిబ్బంది పప్పును తీసుకువెళ్లడానికి నిరాకరించారు.