వినాయక నిమజ్జనానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. పట్టణంలోని ఆయా వార్డులో నెలకొల్పిన వినాయకులను శనివారం స్థానిక బంగల్పేట్ కాలనీలోని వినాయక సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. బంగల్ పేట్ చెరువులో వినాయకులను నిమజ్జనం చేసేందుకు చెరువు చుట్టూ బారికేడ్ లను ఏర్పాటు చేశారు. క్రేన్, గజ ఈతగాళ్ళు, అందుబాటులో ఉంచారు.