కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కల్లూరు అర్బన్ పరిధిలోని ముజఫర్ నగర్‌లో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో నాలుగో పట్టణ సిఐ విక్రమసింహ, ఎస్సైలు మోహన్ కిషోర్ ,గోపీనాథ్, రామమునయ్య పోలీసు సిబ్బంది కలిసి పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. నిబంధనలు పాటించని 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు శాంతిభద్రతల్ని కాపాడాలని, అనుమానితులపై సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.