ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయాలని KVPS జిల్లా కార్యదర్శి దినకర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు బూట్లు, బెడ్ షీట్లు,పరుపులు,అత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో సోలో హీటర్లు రాకపోవడంతో విద్యార్థులు చల్లటి నీటితో స్నానాలు చేస్తూ అనారోగ్య పాలవుతున్నారన్నారు.