హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంపులోని మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో గత నాలుగు రోజుల నుండి విద్యార్థులపై ఎలుకలు దాడి చేయడంతో ప్రిన్సిపాల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులకు గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ABVPవిద్యార్థి సంఘం నాయకుడు సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు విచారిస్తున్నట్లైతే మరిన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘం నాయకులు అక్కడికి వెళ్ళగా గేటుకు తాళం వేసి అనుమతి లేదని అంటున్నారని మండిపడ్డారు.