Download Now Banner

This browser does not support the video element.

కన్నుల పండుగగా గణేష్ ఘాట్లో గంగా హారతి కార్యక్రమం, భారీగా తరలివచ్చిన భక్తులు

India | Aug 31, 2025
నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న గణేష్ ఘాటు వద్ద గంగా హారతి కార్యక్రమం కనుల పండుగ జరిగింది. కాసి నుంచి వచ్చిన పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేషంగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి వస్తున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా ఈ గంగా హారతి కార్యక్రమం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆదివారం రాత్రి 8 గంటలకు హాజరయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us