జగిత్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర పట్టణ వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో గత తొమ్మిది రోజులుగా వాడవాడల గణనాథుని మండపాలలో స్వామివారికి అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలను అందుకున్న ఘననాథుడు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండే గణేశుని శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగుతుంది. గణనాథుని నిమర్జనం సందర్భంగా వాహనాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి గణనాథుని ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర డప్పు చప్పుళ్ళ మధ్య భక్తి పాటలతో మహిళలు చిన్నపిల్లలు పెద్దలు డాన్సులు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గణపతి బొప్పా మోరయ అంటూ పట్టణ వీధుల గుండా స్థానిక