యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినా, నిర్దేశిత ధరల కన్నా అధిక ధరలకు విక్రయించినా కేసులు నమోదు చేయాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన కలెక్టర్ కార్యాలయంలో యూరియా స్టాక్, సరఫరా తదితర అంశాలపై RDOలు, ADAలతో VC ద్వారా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి RSKల వారీగా పంట నమోదు వివరాలు సేకరించాలన్నారు. పంటలకు ఎంత మోతాదులో యూరియా వేయాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.