బోధన్ మండలంలోని బిక్నెల్లి గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు బాలాజీ, యాదు మృతికి కారణమైన గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి, పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. మృతి చెందిన బాలాజీ, యాదు కుటుంబాలను ఆదుకుంటామని బోధన్ సబ్ కలెక్టర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం