మొవ్వ మండలం నిడుమోలులో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, మొవ్వ మండల పార్టీ అధ్యక్షుడు లింగమనేని రామలింగేశ్వరరావు కొత్తగా ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి ట్యాంకర్ను ఎమ్మెల్యే కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో పామర్రు ఏఎంసీ ఛైర్మన్ శోభన్ బాబు తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి తీర్చడంలో కూటమి నాయకుల సహకారం అపూర్వమని పామర్రు ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా అన్నారు.