మచిలీపట్నంలో ఉత్సాహంగా OG ప్రీమియర్ షో వేడుకలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ప్రీమియర్ షో వేడుకలు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలో ఉత్సాహంగా నిర్వహించారు. జనసేన సెంట్రల్ ఆంధ్రా కో-కన్వీనర్ కోరియర్ శ్రీను ఆధ్వర్యంలో స్థానిక థియేటర్ ఎదురుగా భారీ సెట్టింగ్తో వేదిక ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. భారీ LED స్క్రీన్పై OG టీజర్, స్పెషల్AV ప్రదర్శించారు. అభిమానులు పవన్ పాటలకు డ్యాన్స్ వేసి సందడి చేశారు.