శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ వద్ద మంగళవారం ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలు ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై తనకల్లు ఎస్సై గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలియజేశారు.