కడప జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు , బాక్స్ టెండర్లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేసి బాక్స్ టెండర్లు ఎగ్జిబిషన్ దక్కించుకున్నారు.