శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురుకులాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నమోదు చేసుకున్న విద్యార్థుల హాజరు పూర్తిస్థాయిలో ఉండేలా రెగ్యులర్ మానిటరింగ్ చేయాలన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు స్టడీ అవర్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించే చర్యలు చేపట్టాలన్నారు