శాలిగౌరారం మండలంలోని గ్రామాలకు నియమితులైన గ్రామ పాలన అధికారులతో మంగళవారం మండల తహసిల్దార్ జమీరుద్దీన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టవలసిన పనులు పాలన విధివిధానాలపై తాసిల్దార్ జమీరుద్దీన్ చర్చించారు .ఈ సమావేశంలో నాయబ్ తహసిల్దార్ వరప్రసాద్, గిరిధవర్లు రఫీ,అజారుద్దీన్ గ్రామ పాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.