ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజలకు నకిలీ పథకాలపై బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు పలు సూచనలు చేశారు. విశ్వకర్మ పథకంలో భాగంగా మీ అకౌంట్లో నగదు జమ చేస్తామని పదివేల రూపాయలు జీఎస్టీ కట్టండి అని ఫేక్ కాల్స్ వస్తున్నాయి. అటువంటి విషయాలలో మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు కట్టమని ఎవరికీ చెప్పదు అందువల్ల ఎవరు నమ్మవద్దని తెలిపారు. పట్టణంలో దొంగ స్కీములు చాలా వచ్చాయని చాలామంది తీవ్రంగా నష్టపోయారని కాకపోతే ప్రజలు బయటికి చెప్పుకోవడం లేదన్నారు. కష్టార్జితం నమ్ముకోండి ఊరికే ఏది రాదు అని హితవు పలికారు.