దివంగత పేర్ని కృష్ణమూర్తికి నివాళులర్పించిన వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని దివంగత, మాజీ మంత్రి స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలోని పీకేఎం కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తన తండ్రి కృష్ణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్మిక వర్గాల సంక్షేమానికి పేర్ని కృష్ణమూర్తి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.